సెమీస్‌పై భారత్ గురి
ABN , Publish Date - May 01 , 2026 | 02:19 AM
థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరాలన్న పట్టుదలతో ఉంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో...
చైనీస్ తైపీతో క్వార్టర్స్ నేడు
థామస్ కప్ ఫైనల్స్
హోర్సెన్స్ (డెన్మార్క్): థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరాలన్న పట్టుదలతో ఉంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బలమైన ప్రత్యర్థి చైనీస్ తైపీతో తలపడనుంది. గ్రూప్-ఎలో కెనడా, ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్.. చైనా చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. కాగా, గ్రూప్-సి టాపర్‌గా నిలిచిన తైపీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బలంగా ఉంది. మరోవైపు భారత జట్టు కూడా సింగిల్స్, డబుల్స్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఆయు ష్ శెట్టి జోరుమీదుండగా.. మూడో సింగిల్స్ బాధ్యతలను ప్రణయ్, శ్రీకాంత్ తీసుకోనున్నారు. రెండు మ్యాచ్‌ల్లో ఓడినా లక్ష్యసేన్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలున్నాయి. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మలేసియా తో చైనా, జపాన్‌తో ఫ్రాన్స్, థాయ్‌లాండ్‌తో డెన్మార్క్ ఆడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?