Share News

భారత్‌ లక్ష్యం..ప్లేఆఫ్స్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:38 AM

ప్రతిష్ఠాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానా గ్రూప్‌-1 టెన్నిస్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. భారత్‌తోపాటు...

భారత్‌ లక్ష్యం..ప్లేఆఫ్స్‌

నేటినుంచి బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ పోరు

సహజపై సింగిల్స్‌ ఆశలు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానా గ్రూప్‌-1 టెన్నిస్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. భారత్‌తోపాటు ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్‌ టోర్నీ బరిలో ఉన్నాయి. స్వదేశీ పరిస్థితుల్లో సత్తా చాటడం ద్వారా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్‌ తల పడుతోంది. అయితే వెన్నునొప్పితో తెలుగమ్మాయి శ్రీవల్లి వైదొలగడం జట్టుకు ప్రతి కూలంగా మారనుంది. దాంతో దేశ నెంబర్‌ 2 క్రీడాకారిణి, మరో తెలుగమ్మాయి సహజపై సింగిల్స్‌ ఆశలు నిలిచాయి. సింగిల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో పోటీలు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి.

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 07 , 2026 | 02:38 AM