ఐర్లాండ్‌తో తొలి టీ20.. చిత్తుగా ఓడిన భారత్
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:54 PM
బెల్‌ఫాస్ వేదికగా ఇర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది పాలైంది. కీలక సమయాల్లో అటు టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలం 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 148 పరుగులకే ఆల్‌ఔట్ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: బెల్‌ఫాస్ట్ వేదికగా ఇర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. కీలక సమయాల్లో అటు టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక టీమిండియా 148 పరుగులకే ఆల్‌ఔట్ అయ్యింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లొర్కాన్ టక్కర్ 36 బంతుల్లో మెరుపు అర్ధ సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేశాడు. చివరి ఓవర్లల్లో గ్యారెత్ డెలానీ 49 పరుగులు రాబట్టడంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు రాబట్టాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక ఛేదనలో భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ గొప్ప శుభారంభాన్ని ఇచ్చాడు. కేవలం 20 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తరువాత టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారత్ చిక్కుల్లో పడింది. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), తిలక్ వర్మ (19) త్వరగా వికెట్లు కోల్పోవడంతో 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత వచ్చిన వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే (25), అక్షర్ పటేల్ (15) ఆశించిన మేర రాణించకపోవడంతో భారత్ ఓటమి ఖరారైపోయింది. చివరకు హర్షిత్ రాణా (8), అర్షదీప్ సింగ్ (2) కూడా వెనుదిరగడంతో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ భారత్‌పై విజయం సాధించింది. ఐర్లాండ్ బౌలర్లు మ్యాథ్యూ హంపేరీస్, మ్యాథ్యూ హొల్లార్డ్ భారత్ పతనాన్ని శాశించారు. మిడిల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచి వికెట్లు రాబట్టుకున్నారు. హంపేరీస్, హోల్లార్డ్ చెరో మూడు వికెట్లు తీయగా జైమూంద్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ వార్తలనూ చదవండి:
సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
అరుదైన రికార్డు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్లు