ఆకాశ్, అన్షుల్‌కు చోటు
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:26 AM
న్యూజిలాండ్‌తో 5 వన్డేలు, 2 టెస్టుల సిరీ్‌సకు భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. పేసర్లు ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్
వన్డే జట్టునూ ప్రకటించిన సెలెక్టర్లు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో 5 వన్డేలు, 2 టెస్టుల సిరీ్‌సకు భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. పేసర్లు ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. కండరాల గాయానికి గురైన ఆకాశ్ ఇటీవలే పోటీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. చివరిసారి.. అతడు నిరుడు ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో ఆడాడు. అదే ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అరంగేట్రం చేసిన అన్షుల్‌ను ఆ తర్వాత జట్టు నుంచి తొలగించారు.
రెగ్యులర్ కెప్టెన్ గిల్..కివీస్‌తో టెస్టు సిరీ్‌సకు సన్నద్ధమయ్యే క్రమంలో న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు శ్రేయాస్ అయ్యర్ సారథ్యం వహిస్తాడు. టెస్టు సిరీస్ నవంబరు 19న మొదలవనుంది. దానికి ముం దు.. 4వ తేదీనుంచి వన్డే సిరీస్ జరగనుంది. కాగా, ప్రధాన పేసర్ బుమ్రాను కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు.
టెస్టు జట్టు: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్ (వైస్ కెప్టెన్), పడిక్కళ్, పంత్ (కీపర్), జురెల్ (కీపర్), జడేజా, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, ప్రసిద్ధ్, ఆకాశ్‌దీ్‌ప, సాయి సుదర్శన్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్.
న్యూజిలాండ్‌తో తొలి మూడు వన్డేలకు జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), నితీశ్, అక్షర్, నమన్ ధిర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్, అర్ష్‌దీప్, ఇషాన్, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్.
4,5 వన్డేలకు: శ్రేయాస్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, తిలక్, ఇషాన్ (కీపర్, వైస్ కెప్టెన్), నితీశ్, అక్షర్, నమన్, అకీబ్ నబీ, గుర్నూర్, రుతురాజ్, అర్ష్‌దీప్, కుమార్ కుశాగ్ర (కీపర్), సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్.
ఇవీ చదవండి:
వర్చువల్ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్
గుజరాతీ గర్బాకు స్విస్ అంబాసిడర్ మాయా టిస్సాఫి ఫిదా.!