భారత్ వెనుకంజ
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:53 AM
దక్షిణ కొరియాతో డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత్ రెండు సింగిల్స్ మ్యాచ్‌లను కోల్పోయింది. సూన్‌వూ క్వోన్, హియాన్ చుంగ్ చేతిలో భారత ఆటగాళ్లు ఓడారు. శనివారం డబుల్స్, రివర్స్ సింగిల్స్‌లో భారత్‌కు కీలక పోటీలు ఉన్నాయి.
రెండు సింగిల్స్‌లోనూ పరాజయం
కొరియాతో డేవిస్ కప్
సియోల్: డేవిస్ కప్ క్వాలిఫయర్స్ రౌండ్ 2ను భారత్ నిరాశాజనకంగా ఆరంభించింది. శుక్రవారం దక్షిణ కొరియాతో జరిగిన రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు ఓడిపోయారు. ముందుగా దక్షిణేశ్వర్ సురేశ్ 6-3, 3-6, 4-6 తేడాతో సూన్‌వూ క్వోన్ చేతిలో పోరాడి ఓడాడు. ఇక రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6-2, 4-6, 5-7 తేడాతో హియాన్ చుంగ్‌కు గట్టి పోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం శ్రీరామ్ బాలాజీ/నికీ పూనాచ ఆడే డబుల్స్ పోరుతో పాటు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లను గెలవడం భారత్‌కు తప్పనిసరి కానుంది.