సూపర్ సిక్స్‌కు యువ భారత్
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:29 AM
అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం అందుకుంది. శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 7 వికెట్లతో...
బులవాయో: అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం అందుకుంది. శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 7 వికెట్లతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. మొదట న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 రన్స్‌కు ఆలౌటైంది. ఆపై డక్‌వర్త్ నిబంధన ప్రకారం భారత్ లక్ష్యాన్ని 130 రన్స్‌కు కుదించారు. దానిని యువ భారత్ 13.3 ఓవర్లలో 130/3 స్కోరుతో ఛేదించింది. గ్రూపులో ఆడిన మూడు మ్యాచ్‌లూ నెగ్గిన భారత్ (6 పాయింట్లు) టాపర్‌గా సూపర్ సిక్స్ దశకు చేరింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్