‘పారా’ హుషారుగా...
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:02 AM
వారంపాటు క్రీడాభిమానులను అలరించిన పారా ఆసియా క్రీడలకు శనివారం తెరపడింది. 45 దేశాలనుంచి తరలొచ్చిన...
ముగిసిన పారా ఆసియా క్రీడలు
ఖతార్‌లో కలుద్దామంటూ వీడ్కోలు
నగోయ (జపాన్): వారంపాటు క్రీడాభిమానులను అలరించిన పారా ఆసియా క్రీడలకు శనివారం తెరపడింది. 45 దేశాలనుంచి తరలొచ్చిన నాలుగు వేలమంది అథ్లెట్లు, అధికారులు ఈ క్రీడల్లో పాలుపంచుకున్నారు. 18 క్రీడాంశాల్లో అథ్లెట్లు తమ అద్భుత ప్రతిభా పాటవాలతో అబ్బురపరిచారు. ఏడు రోజుల పోటీల్లో 20కిపైగా ప్రపంచ రికార్డులు బద్దలుగావడం విశేషం. 168 మంది అథ్లెట్లతో బరిలో దిగిన భారత్ రికార్డు స్థాయిలో 114 (30-35-49) పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 2022 హాంగ్జౌ పారా ఆసియాడ్‌లో 309 మంది భారత బృందం గెలుపొందిన 108 పతకాల రికార్డును ఈసారి తిరగ రాశారు. ఈసారి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 207 స్వర్ణాలు సహా మొత్తం 435 పతకాలతో చైనా అగ్రస్థానం దక్కించుకుంది. ఆతిథ్య జపాన్ (64-60-62) 186 పతకాలతో రెండో స్థానంలో, ఉబ్జెకిస్థాన్ (145) మూడో స్థానంలో నిలిచాయి. ఇక, ముగింపు ఉత్సవంలో భారత షూటర్ మోనా అగర్వాల్, హైజంపర్ నిషాద్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని చేబూని జట్టును నడిపించారు. తదుపరి క్రీడలు జరిగే ఖతార్‌లో కలుద్దామంటూ అథ్లెట్లు వీడ్కోలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు