చైనా చేతిలో భారత్ ఓటమి
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:38 AM
థామస్ కప్ ఫైనల్స్.. గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత్ 2-3తో చైనా చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్-ఎ నుంచి భారత్, చైనా ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే...
థామస్ కప్ ఫైనల్స్
హోర్సెన్స్ (డెన్మార్క్): థామస్ కప్ ఫైనల్స్.. గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత్ 2-3తో చైనా చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్-ఎ నుంచి భారత్, చైనా ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే. దీంతో చైనా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బుధవారం చైనాతో జరిగిన పోరులో తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 19-21, 21-8, 12-21తో లి షిఫెంగ్ చేతిలో, డబుల్స్‌లో సాత్విక్/చిరాగ్ 13-21, 21-13, 24-26తో లియాంగ్/వాంగ్ చేతిలో ఓడడంతో భారత్ 0-2తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో రెండో సింగిల్స్‌లో ఆయుష్ 17-21, 21-13, 21-15తో వెంగ్ యాంగ్‌ను చిత్తుచేసి చైనా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. రెండో డబుల్స్‌లో అర్జున్/హరిహరన్ 17-21, 13-21తో టింగ్/జియాంగ్ చేతిలో ఓడారు. దాంతో 3-1తో పోరును చైనా దక్కించుకుంది. నామమాత్రమైన మూడో సింగిల్స్‌లో ప్రణయ్ 20-22, 21-19, 21-11తో గ్వాంగ్‌పై నెగ్గాడు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్