చైనా చేతిలో చిత్తు
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:32 AM
నిర్ణాయక గేమ్‌లో బలమైన స్థితిలో నిలిచి ఆశలు రేపిన పీవీ సింధు అనూహ్యంగా పట్టుకోల్పోగా.. మిగతా షట్లర్లు ఘోరంగా విఫలం కావడంతో...
ఉబెర్ కప్ నుంచి భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): నిర్ణాయక గేమ్‌లో బలమైన స్థితిలో నిలిచి ఆశలు రేపిన పీవీ సింధు అనూహ్యంగా పట్టుకోల్పోగా.. మిగతా షట్లర్లు ఘోరంగా విఫలం కావడంతో ఉబెర్‌కప్ ఫైనల్స్ నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమించింది. గ్రూప్-ఎలో సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 0-5తో డిఫెండింగ్ చాంప్ చైనా చేతిలో చిత్తుగా ఓడింది. డెన్మార్క్ చేతిలో 2-3తో ఓడిన భారత మహిళల జట్టు.. ఉక్రెయిన్‌పై 4-1తో గెలిచింది. కానీ, చైనా చేతిలో ఓడడంతో గ్రూప్‌లో మూడో స్థానానికే పరిమితమైంది. టాప్-2లో నిలిచిన చైనా, డెన్మార్క్‌లు క్వార్టర్స్‌కు చేరుకొన్నాయి. తొలి సింగిల్స్‌లో సింధు 16-21, 21-19, 19-21తో వరల్డ్ నెం:2 వాంగ్ జియి చేతిలో ఓడింది. ఆ తర్వాత డబుల్స్‌లో ప్రియ-శ్రుతి మిశ్రా జోడీ 11-21, 8-21తో లి సెంగ్ షు-టాన్ నింగ్ చేతిలో, ఇస్రాని 20-22, 13-21తో చెన్ యు ఫి చేతిలో, క్రాస్టో-కవిప్రియ 21-10, 12-21, 19-21తో లియో జు మిన్-జియాన్ చేతిలో, దేవిక 21-19, 17-21, 10-21తో జు వెన్ జింగ్ చేతిలో చిత్తయ్యారు.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ