నీలం జెర్సీలోనే హాకీ జట్లు
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:33 AM
ఆసియాగేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తిరిగి నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి...
న్యూఢిల్లీ: ఆసియాగేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తిరిగి నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నాయి. ఇటీవల నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్‌క్‌పలో భారత జట్లు కాషాయ రంగులో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ రంగు మార్పుపై తీవ్ర విమర్శలు రాగా, హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో కూడా విభేదాలు కనిపించాయి. అయితే తాజాగా జట్ల కిట్ రంగు విషయంలో ప్రాధాన్యత తెలపమంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమని కోరిందని, అందుకే హెచ్‌ఐ నీలం రంగునే ఎంచుకుందని హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కే పేర్కొన్నాడు. కాషాయం రెండో రంగు ప్రాధాన్యతగా ఉండనుంది.
ఇవి కూడా చదవండి:
గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్