భారత్ షూటౌట్
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:29 AM
పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ను భారత జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. శుక్రవారం ఏడు, ఎనిమిది స్థానాలను నిర్ణయుంచే వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్ల...
8వ స్థానంతో సరి
బెల్జియం చేతిలో ఓటమి
హాకీ వరల్డ్ కప్
ఆమ్‌స్టెల్వీన్: పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ను భారత జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. శుక్రవారం ఏడు, ఎనిమిది స్థానాలను నిర్ణయుంచే వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా.. బెల్జియం 4-3తో భారత్‌ను ఓడించింది. దీంతో బెల్జియం 7, భారత్ 8వ స్థానంలో నిలిచాయి. ఇరు జట్లు నిర్ణీత సమయం ముగిసే సరికి 3-3తో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆరో నిమిషంలోనే అభిషేక్ తొలి గోల్ చేయగా, తర్వాత హర్మన్‌ప్రీత్ 31, 60వ నిమిషాల్లో గోల్స్ సాధించాడు. అనంతరం షూటౌట్‌లో బెల్జియం నాలుగు గోల్స్ చేయగా, భారత్ మూడు మాత్రమే సాధించడంతో ఓటమి తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు