Under 19 World Cup 2026: ఫేవరెట్ భారత్
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:03 AM
అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గురువారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో...
మ. 1.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్
అండర్-19 వరల్డ్ కప్
బులవాయో: అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గురువారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో యూఎ్‌సపై విజయం సాధించిన భారత యువ జట్టులో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్..బంగ్లాదేశ్‌పై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
కుర్రాళ్ల ఘన బోణీ: అండర్-19 వన్డే ప్రపంచక్‌పలో గురువారం అమెరికాతో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో గెలిచింది. మొదట అమెరికా.. పేసర్ హెనిల్ పటేల్ (5/16) ధాటికి 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీష్ సూదిని (36) టాప్‌స్కోరర్. అనంతరం వర్షం కారణంగా భారత్ ఛేదనను 37 ఓవర్లలో 96 రన్స్‌గా నిర్ధారించారు. దీంతో భారత్ 17.2 ఓవర్లలోనే 99/4 స్కోరు చేసి నెగ్గింది. అభిగ్యాన్ కుందు (42 నాటౌట్), కెప్టెన్ ఆయుష్ మాత్రే (19) రాణించారు.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్