సిరీస్ పట్టేస్తారా
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:28 AM
వరుసగా తొమ్మిది వన్డేలు గెలిచి దూకుడు మీదున్న న్యూజిలాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే భారత్ ఝలకిచ్చింది. ఇక మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం కీలక రెండో మ్యాచ్ జరగనుంది...
మధ్యాహ్నం 1.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్‌లో..
నేడు న్యూజిలాండ్‌తో
భారత్ రెండో వన్డే
రాజ్‌కోట్: వరుసగా తొమ్మిది వన్డేలు గెలిచి దూకుడు మీదున్న న్యూజిలాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే భారత్ ఝలకిచ్చింది. ఇక మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం కీలక రెండో మ్యాచ్ జరగనుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా ఈ పోరులోనూ నెగ్గి సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అయితే తొలి వన్డేలో భారత్ జోరుకు ఆఖర్లో కళ్లెం వేసిన కివీస్ బౌలర్లు చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు కూడా ధారాళంగా పరుగులిచ్చుకోవడం ఆందోళనపరిచే విషయం. అందుకే రాజ్‌కోట్‌లో రెండు విభాగాల్లోనూ గిల్‌సేన పూర్తి ఆధిపత్యం చూపాలనుకుంటోంది. సిరీస్‌లో నిలవాలంటే మ్యాచ్ గెలవాలి కాబట్టి కివీస్ కూడా గట్టిగా పోరాడాలనుకుంటోంది.
నితీశ్‌కు చాన్స్!: సిరీ్‌సను భారత్ విజయంతో ఆరంభించినా.. సరిదిద్దుకోవాల్సిన లోపాలున్నాయి. తొలి మ్యాచ్‌లో ముఖ్యంగా కివీస్ బ్యాటర్లు మన బౌలర్లను సులువుగా ఎదుర్కోగలిగారు. మన స్పిన్నర్లు ప్రభావం చూపలేదు. అలాగే విరాట్ నిష్క్రమణ తర్వాత భారత్ టపటపా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదం తెచ్చుకుంది. టాపార్డర్‌లో రోహిత్, గిల్, కోహ్లీలతో పాటు శ్రేయాస్ ఫామ్ మరోసారి కీలకం కానుంది. రోహిత్ ఇక్కడ ఆడిన 3 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ దూరమవడంతో అతడి స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ ఆడే చాన్సుంది. అలాగే పేసర్ ప్రసిద్ధ్ స్థానంలో అర్ష్‌దీ్‌పనకు చాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
గెలుపే ధ్యేయంగా..: తొలి మ్యాచ్‌లో ఓడినా కివీస్ అందరినీ ఆకట్టుకోగలిగింది. ఓపెనర్లు నికోల్స్, కాన్వే తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యంతో భారత్‌ను ఇబ్బందిపెట్టారు. మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు జతగా చివర్లో క్లార్క్, హేయ్ కూడా భారీస్కోరుకు కారణమయ్యారు. అయితే మధ్య ఓవర్లలో మరిన్ని పరుగులు సాధించి ఉంటే కివీ్‌సకు గెలుపు దక్కేది. అటు కివీస్ బౌలర్లు కూడా భారత్‌ను చివరి వరకు ఒత్తిడిలో ఉంచగలిగారు. అయితే కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం ఆ జట్టును ఇబ్బందిపెట్టింది. ఈ మ్యాచ్‌లో హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా రాణిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. పేసర్ జేమిసన్ పదునైన బంతులతో భారత బ్యాటర్లను వణికించాడు. అతడికి ఇతర పేసర్ల నుంచి సహకారం అందాల్సి ఉంది.
పిచ్
రాజ్‌కోట్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 322. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లను ఆశించవచ్చు. అలాగే ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లోనూ ఛేదన జట్టుకు పరాజయాలే ఎదురయ్యాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, గిల్ (కెప్టెన్), విరాట్, శ్రేయాస్, రాహుల్, జడేజా, నితీశ్ కుమార్, హర్షిత్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్/అర్ష్‌దీప్.
కివీస్: కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హేయ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్ (కెప్టెన్), క్లార్క్, జేమిసన్, ఫౌక్స్, అశోక్.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు