భారత్ ఓటమి
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:37 AM
బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 మూడో పోరులో భారత్ 0-3తో ఇండోనేసియా చేతిలో ఓటమి చవిచూసింది...
బిల్లీ జీన్ కింగ్ కప్
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 మూడో పోరులో భారత్ 0-3తో ఇండోనేసియా చేతిలో ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన ఈ పోటీల్లోని తొలి సింగిల్స్‌లో ప్రిస్కా 6-7(3), 7-6(3), 6-3 తో వైష్ణవిని ఓడించింది. రెండో సింగిల్స్‌లో తెలుగమ్మాయి సహజ 2-6, 1-6తో జానైస్ చేతిలో చిత్తవడంతో ఇండోనేసియాకు 2-0 ఆధిక్యం లభించింది. చివరిదైన డబుల్స్‌లో రుతుజా/అంకిత జంట 3-6, 6-7 (7)తో అల్డిలా/జానైస్ ధాటికి తలొగ్గింది. తొలి పోరులో థాయ్‌లాండ్ చేతిలో ఓడిన భారత్..రెండో పోరులో న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇప్పుడిక తాజా పరాజయం దరిమిలా భారత జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య