విహాన్ అజేయ శతకం
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:42 AM
అండర్-19 వన్డే వరల్డ్‌క్‌పలో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర సాగుతోంది. విహాన్ మల్హోత్రా (107 బంతుల్లో 109 నాటౌట్) అజేయ శతకానికి, బౌలర్ల రాణింపు తోడైంది. దీంతో మంగళవారం జింబాబ్వేతో...
అండర్-19 వన్డే వరల్డ్‌కప్
భారత్‌కు భారీ విజయం
204 రన్స్‌తో జింబాబ్వే చిత్తు
బులవాయో: అండర్-19 వన్డే వరల్డ్‌క్‌పలో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర సాగుతోంది. విహాన్ మల్హోత్రా (107 బంతుల్లో 109 నాటౌట్) అజేయ శతకానికి, బౌలర్ల రాణింపు తోడైంది. దీంతో మంగళవారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61), వైభవ్ (30 బంతుల్లో 52) అర్ధసెంచరీలతో 50 ఓవర్లలో 352/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో ఖిలన్ (12 బంతుల్లో 30) చెలరేగి స్కోరును 350 దాటించాడు. ఛేదనలో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మాత్రే మూడు వికెట్లతో కట్టడి చేశాడు.
భారత్: 50 ఓవర్లలో 352/8 (విహాన్ 109 నాటౌట్, అభిగ్యాన్ 61, వైభవ్ 52, ఖిలన్ 30; తటెండ 3/49, సింబరషె 2/51, మజాయ్ 2/86); జింబాబ్వే: 37.4 ఓవర్లలో 148 ఆలౌట్ (చివౌలా 62, బ్లిగ్నాట్ 37; ఆయుష్ 3/14, ఉధవ్ 3/20, అంబరీష్ 2/19)
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్