చాంపియన్ భారత్
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:02 AM
ఆసియా లాక్రోస్ గేమ్స్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు అదరగొట్టాయి. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు...
కెప్టెన్ అనుదీప్ తెలుగోడే
ఆసియా లాక్రోస్ చాంపియన్‌షిప్
హైదరాబాద్: ఆసియా లాక్రోస్ గేమ్స్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు అదరగొట్టాయి. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు విజేతలుగా నిలిచి డబుల్ గోల్డ్ సాధించాయి. ఒలింపిక్ క్రీడ అయిన ఈ లాక్రోస్ ఈవెంట్ పురుషుల ఫైనల్లో భారత్ 9-2తో ఇరాక్‌ను ఓడించగా, మహిళల బృందం 22-5తో పాకిస్థాన్‌పై గెలిచింది. ట్రోఫీ నెగ్గిన భారత పురుషుల జట్టు కెప్టెన్ అనుదీప్ రెడ్డి తెలంగాణకు చెందిన క్రీడాకారుడు కావడం విశేషం. అనుదీప్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా వేముల గ్రామం. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన హుస్సేన్‌సాబ్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
లాక్రోస్ గేమ్ అంటే..: హాకీ, సాకర్, బాస్కెట్‌బాల్‌ల సమ్మేళనమే లాక్రోస్ క్రీడ. ఒక్కో జట్టులో పదిమంది ఉంటారు. హెల్మెట్, గ్లోవ్స్, ప్యాడ్స్ ధరించి నెట్‌తో కూడిన పొడవాటి స్టిక్‌తో రబ్బరు బంతిని ప్రత్యర్థి గోల్‌లోకి పంపడమే ఈ ఆట. పురుషులు, మహిళలు ఆడే ఈ క్రీడను మొదటగా 1904, 1908 ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2028లో జరిగే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ఆటను చేర్చారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..