Share News

హాకీలో డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:23 AM

జూనియర్‌ ఆసియాక్‌పలో డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత పురుషులు, మహిళల జట్లు టైటిళ్లను నిలబెట్టుకొన్నాయి....

హాకీలో డబుల్‌ ధమాకా

భారత్‌కే పురుషులు, మహిళల టైటిళ్లు

జూనియర్‌ ఆసియాకప్‌

అమ్మాయిల హ్యాట్రిక్‌

మోకి (చైనా): జూనియర్‌ ఆసియాక్‌పలో డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత పురుషులు, మహిళల జట్లు టైటిళ్లను నిలబెట్టుకొన్నాయి. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిల బృందం 1-0తో చైనాను ఓడించింది. దీంతో వరుసగా మూడోసారి ఆసియాకప్‌ గెలిచిహ్యాట్రిక్‌ సాధించింది. అంతేకాదు.. ఈ విజయంతో జూనియర్‌ వరల్డ్‌క్‌పనకు కూడా భారత అమ్మాయిలు అర్హత సాధించారు. సనిక చంద్రకాంత్‌ మానె (17వ నిమిషం) ఏకైక గోల్‌తో జట్టుకు టైటిల్‌ అందించింది.

15-sports.jpg

అబ్బాయిలు ఆరోసారి..

డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు రికార్డుస్థాయిలో ఆరోసారి ఆసియా కప్‌ను ఎగరేసుకు పోయింది. తుది పోరులో భారత్‌ 4-1తో కొరియాను చిత్తు చేసింది. అజిత్‌ యాదవ్‌ (9వ), కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా(13వ), ప్రభ్‌దీప్‌ సింగ్‌ (21వ), అషు మౌర్య (50వ) భారత్‌ తరఫున గోల్స్‌ చేశారు. కొరియా ఆటగాడు లి మిన్‌ హ్యోక్‌ 54వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచి భారత్‌ ఆధిక్యాన్ని కొంతమేర తగ్గించాడు. భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో టైటిల్‌కాగా.. ఓవరాల్‌గా ఆరోది కావడం విశేషం. కాగా, విజేతలుగా నిలిచిన భారత పురుషులు, మహిళల జట్ల సభ్యులు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున హాకీ ఇండియా నజరానా ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 05:23 AM