భారత్ క్లీన్ స్వీప్
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:32 AM
బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 తొలిపోరులో థాయ్‌లాండ్ చేతిలో ఓడిన భారత్.. అనంతరం అద్భుతంగా పుంజుకుంది...
జిలాండ్‌తో బిల్లీ జీన్ కింగ్ పోరు
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 తొలిపోరులో థాయ్‌లాండ్ చేతిలో ఓడిన భారత్.. అనంతరం అద్భుతంగా పుంజుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో పోరులో మూడు మ్యాచ్‌లకు మూడింటిని గెలిచి క్లీన్‌స్వీ్‌ప చేసింది. రెండు సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లను భారత్ దక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో వైష్ణవి అద్కర్ 6-2, 6-4తో ఐషి దాస్‌పై నెగ్గగా, రెండో సింగిల్స్‌లో తెలుగమ్మాయి సహజ 6-1, 6-3తో వాలెంటినాను చిత్తు చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0తో రెట్టింపు చేసింది. ఇక..చివరిదైన డబుల్స్ మ్యాచ్‌లో రుతుజా భోసాలే/అంకిత రైనా ద్వయం 6-4, 6-2తో మోనిక్ బారీ/ఎరిన్ రోట్లిఫ్ జంటపై నెగ్గి భారత్ విజయాన్ని సంపూర్ణం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య