Share News

విశ్వనాథ్‌ పసిడి పంచ్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:06 AM

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం చేరిం ది. విశ్వనాథ్‌ సురేశ్‌ పసిడి పంచ్‌తో సత్తా చాటాడు. చివరిరోజైన శుక్రవారం జరిగిన...

విశ్వనాథ్‌ పసిడి పంచ్‌

ఆసియా బాక్సింగ్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం చేరిం ది. విశ్వనాథ్‌ సురేశ్‌ పసిడి పంచ్‌తో సత్తా చాటాడు. చివరిరోజైన శుక్రవారం జరిగిన 50 కిలోల విభాగం ఫైనల్లో విశ్వనాథ్‌ 5-0తో జపాన్‌ బాక్సర్‌ డైచి ఇవాయ్‌పై గెలిచాడు. ఇక, 60 కిలోల కేటగిరి ఫైనల్లో సచిన్‌ 2-3తో ఓరాజ్బెక్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే టోర్నీలో మీనాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతి తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఓవరాల్‌గా భారత్‌ 5 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో 16 పతకాలు నెగ్గి రెండోస్థానంతో టోర్నీకి ఘనంగా ముగింపు పలికింది. కజకిస్థాన్‌ 6 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 05:06 AM