పోరాడి నెగ్గిన భారత్
ABN , Publish Date - May 01 , 2026 | 02:26 AM
ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌ప్సలో భారత జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది....
3-2తో స్లొవేకియాపై గెలుపు.. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు
లండన్: ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లులో భారత జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-7లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో స్లొవేకియాపై పోరాడి నెగ్గింది. తొలి గేమ్‌లో మానుష్ షా 8-11, 11-5, 11-8, 5-11, 6-11తో లుబోమిర్ పిస్తేజ్ చేతిలో ఓడగా.. ఆ తర్వాతి మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 11-6, 11-8, 11-6తో జాకబ్ జెలింకాపై నెగ్గి 1-1తో సమం చేశాడు. కానీ, హర్మీత్ దేశాయ్ 14-16, 5-11, 9-11తో వాంగ్ యాంగ్ చేతిలో ఓడినా.. రివర్స్ సింగిల్స్‌లో మానవ్ 11-3, 15-13, 11-7తో పిస్తేజ్‌పై గెలిచి 2-2తో సమం చేశాడు. నిర్ణాయక మ్యాచ్‌లో మానుష్ షా 11-8, 11-8, 11-7తో జాకబ్ జెలంకాపై నెగ్గి.. భారత్‌కు విజయాన్నందించాడు. రెండు విజయాలతో భారత్ గ్రూప్ టాప్‌నకు చేరుకొంది.
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?