హాంకాంగ్‌పై భారత్ గెలుపు
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:04 AM
ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత్ అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసింది...
ర్యాన్, ఆకాశ్ విజృంభణ
ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్
కోచి: ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత్ అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా సంతతి ఆటగాడు ర్యాన్ విలియమ్స్ నాలుగో నిమిషంలోనే గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. ఇక, ఆకాశ్ మిశ్రా 50వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే, ఆఖర్లో హాంకాంగ్ ఆటగాడు ఎవర్టన్ (65వ) గోల్ చేసినా, భారత్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జరిగిన ఈ మూడో రౌండ్ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. అంతేకాదు.. ఈ గెలుపుతో గతేడాది జూన్‌లో హాంకాంగ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత