పాక్‌పై గెలుపు.. ఆఖరాటకు కుర్రాళ్లు
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:41 AM
సియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది....
కకామిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఆశీష్ (12వ, 49వ, 53వ, 56వ నిమిషాల్లో) నాలుగు గోల్స్ చేసి, భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు. శనివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది. ఇక, మహిళల సెమీ్‌సలో భారత జట్టు చైనా చేతిలో పోరాడి ఓడింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో అనివార్యమైన షూటౌట్‌లో భారత్ 1-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్