Share News

భారత్‌ హ్యాట్రిక్‌

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:04 AM

సందీప్‌ మండి విన్నింగ్‌ గోల్‌తో.. శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ను భారత ఫుట్‌బాల్‌ జట్టు వరుసగా మూడోసారి సొంతం చేసుకొంది. మంగళవారం జరిగిన ఫైనల్లో..

భారత్‌ హ్యాట్రిక్‌

శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌

ఓవరాల్‌గా పదోసారి టైటిల్‌ సొంతం

ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌పై విజయం

ఢాకా: సందీప్‌ మండి విన్నింగ్‌ గోల్‌తో.. శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ను భారత ఫుట్‌బాల్‌ జట్టు వరుసగా మూడోసారి సొంతం చేసుకొంది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ 2-1తో పాకిస్థాన్‌ను ఓడించి, రికార్డుస్థాయిలో పదోసారి శాఫ్‌ టైటిల్‌ను దక్కించుకొంది. సుహైల్‌ భట్‌ (60వ నిమిషం), సందీప్‌ (88వ) చెరో గోల్‌ చేశారు. పాకిస్థాన్‌ తరఫున ఆలంఘిర్‌ ఘాజీ (45+1వ) గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆరంభంలో పాక్‌ దూకుడును ప్రదర్శిస్తే.. భారత్‌ ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ఇరుజట్లూ గోల్స్‌ చేయడంలో విఫలం కావడంతో.. ఫస్టాఫ్‌ గోల్‌లె్‌సగా ముగుస్తుందనిపించింది. కానీ, ఇంజ్యూరీ టైమ్‌లో లుంగ్డిమ్‌ బంతిని క్లియర్‌ చేయడంలో విఫలం కావడంతో.. బంతిని అందుకొన్న ఘాజీ గోల్‌లోకి పంపి పాక్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఇక, ద్వితీయార్థంలో భారత ప్లేయర్‌ బ్రిసన్‌ ఫెర్నాండెజ్‌ను కిందపడేసిన జునైద్‌ షా రెడ్‌ కార్డ్‌కు గురికావడంతో పాక్‌ 10 మంది ఆటగాళ్లకే పరిమితమైంది. ఆ వెంటనే లుంగ్డిమ్‌ ఫ్రీకిక్‌ను అందుకొన్న సుహైల్‌ బంతిని గోల్‌లోకి కొట్టి 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత భారత్‌ వరుస దాడులతో పాక్‌ రక్షణపంక్తిని ఒత్తిడికి గురి చేసింది. ఈ క్రమంలో 88వ నిమిషంలో సందీప్‌ మండి గోల్‌తో భారత్‌ను గెలిపించాడు.

ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ

Updated Date - Nov 18 , 2026 | 06:04 AM