Share News

ఆఖర్లో నాలుగు గోల్స్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:41 AM

చివరి క్వార్టర్‌లో నాలుగు గోల్స్‌తో విజృంభించిన భారత్‌.. పురుషుల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీస్‌కు చేరువైంది...

ఆఖర్లో నాలుగు గోల్స్‌

7-3తో కొరియాపై పురుషుల జట్టు గెలుపు

చివరి క్వార్టర్‌లో నాలుగు గోల్స్‌తో విజృంభించిన భారత్‌.. పురుషుల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీస్‌కు చేరువైంది. పూల్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7-3తో కొరియాను చిత్తు చేసింది. కెప్టెన్‌ అన్‌మోల్‌ ఎక్కా రెండు గోల్స్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆరంభమైన ఐదో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను అన్‌మోల్‌ గోల్‌గా మలిచాడు. రెండో క్వార్టర్‌ 18వ నిమిషంలో లవ్‌నూర్‌ సింగ్‌ ఫీల్డ్‌ గోల్‌ అందిస్తే.. 20వ నిమిషంలో అజిత్‌ యాదవ్‌ గోల్‌ చేశాడు. అయితే, ఆఖరి క్వార్టర్‌ 42వ నిమిషంలో ప్రదీప్‌, 45వ నిమిషంలో గురుసేవక్‌, 55వ నిమిషంలో అన్‌మోల్‌ గోల్స్‌ చేశారు. ఇక ఆఖరి గోల్‌ను అన్‌మోల్‌ సాధించాడు.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:41 AM