Share News

ఆర్చర్ల పతకాల పంట

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:59 AM

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3లో భారత పురుషుల కాంపౌండ్‌, రికర్వ్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించా యి. డబ్ల్యూ-1 కేటగిరీలో స్వాతి చౌదురి రెండు పతకాలు దక్కించుకొంది...

ఆర్చర్ల పతకాల పంట

భారత పురుషుల జట్లకు స్వర్ణాలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌

అహ్మదాబాద్‌: వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3లో భారత పురుషుల కాంపౌండ్‌, రికర్వ్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించా యి. డబ్ల్యూ-1 కేటగిరీలో స్వాతి చౌదురి రెండు పతకాలు దక్కించుకొంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత ఆర్చర్లు రెండు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్యం గెలిచారు. తోమన్‌ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌లతో కూడిన కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో 152-139తో ఇరాక్‌ టీమ్‌పై గెలిచింది. కాగా, హర్వీందర్‌ సింగ్‌, విజయ్‌ సుందీలతో కూడి రికర్వ్‌ జట్టు 6-2తో స్లొవేకియా టీమ్‌పై గెలిచి పసిడి సొంతం చేసుకొంది. భావన, పూజల మహిళల రికర్వ్‌ టీమ్‌ తుది పోరులో 0-6తో చైనా జట్టు చేతిలో ఓడి రజతానికే పరిమితమైంది. డబ్ల్యూ-1 మిక్స్‌డ్‌ ఫైనల్లో స్వాతి-నజీర్‌ జోడీ రన్నర్‌పగా నిలిచింది. ఇక, మహిళల వ్యక్తిగత విభాగం కాంస్య పోరులో స్వాతి 6-2తో రష్యా ప్లేయర్‌ ఎలెనా క్రుటోవాపై గెలిచింది. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ కాంస్య పోరులో శీతల్‌-పాయల్‌ నాగ్‌ జంట ఓడింది.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:59 AM