Share News

పారా ఆసియాడ్‌కు 166 మంది అథ్లెట్లు

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:22 AM

జపాన్‌లో జరిగే పారా ఆసియా క్రీడలకు 10 క్రీడాంశాల్లో తలపడేందుకు భా రత్‌ 166 మంది అథ్లెట్ల బృందాన్ని పంపనుంది. ఈ నెల...

పారా ఆసియాడ్‌కు 166 మంది అథ్లెట్లు

ఆమోదించిన క్రీడా మంత్రిత్వశాఖ

న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగే పారా ఆసియా క్రీడలకు 10 క్రీడాంశాల్లో తలపడేందుకు భా రత్‌ 166 మంది అథ్లెట్ల బృందాన్ని పంపనుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు అయిచి-నగోయలో పోటీలు జరగనున్నాయి. అథ్లెట్లు, సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 275 మందికి క్రీడా మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ జాబితాలో స్టార్‌ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, పారా షట్లర్‌ ప్రమో ద్‌ భగత్‌, సుహాస్‌ యతిరాజ్‌, పారా టీటీ ప్లేయర్‌ భవినా పటేల్‌ ఉన్నారు. భారత క్రీడాకారుల్లో 111 మంది పురుషులు, 55 మంది మహిళలకు చోటుదక్కింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో 62 మంది, పారా బ్యాడ్మింటన్‌లో 28 మంది బరిలోకి దిగనున్నారు. అయితే, వివాదాస్పద షూటింగ్‌ కోచ్‌ జైప్రకాష్‌ నౌటియార్‌పై మంత్రిత్వశాఖ వేటువేసింది. కాగా, గత ఆసియా క్రీడల్లో భారత్‌ 27 స్వర్ణాలు సహా 108 పతకాలు సాధించింది.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:22 AM