Share News

కివీస్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌ డ్రా

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:47 AM

న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగిన తొలి అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ విజయానికి వెలుతురులేమి అడ్డు తగిలింది.

కివీస్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌ డ్రా
India A vs New Zealand A

లింకన్‌: న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగిన తొలి అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ విజయానికి వెలుతురులేమి అడ్డు తగిలింది. 313 పరుగుల ఛేదనలో ఆఖరి రోజు మంగళవారం బరిలోకి దిగిన కివీస్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 187/9 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. అయితే వెలుతురులేమి కారణంగా మరో 18 ఓవర్లు ఉండగానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 516 రన్స్‌కు ఆలౌటైన భారత్‌ ‘ఎ’.. తొలి ఇన్నింగ్స్‌లో 113 రన్స్‌ చేసింది. కివీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 317 రన్స్‌ సాధించింది.


ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 28 , 2026 | 01:47 AM