వేదికలు మార్చేది లేదు..
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:25 AM
భారత్‌లోనే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఐసీసీ మరోసారి స్పష్టంజేసింది. బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్‌లను వేరే చోటుకు తరలించే ప్రసక్తేలేదని బీసీబీకి...
భారత్‌లోనే ఆడాలి
24 గంటల్లోగా తేల్చండి.. లేదంటే స్కాట్లాండ్‌ను దింపుతాం
బంగ్లాదేశ్‌కు ఐసీసీ అల్టిమేటం
బీసీబీకి పాక్ మాత్రమే మద్దతు
దుబాయ్: భారత్‌లోనే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఐసీసీ మరోసారి స్పష్టంజేసింది. బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్‌లను వేరే చోటుకు తరలించే ప్రసక్తేలేదని బీసీబీకి తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం రాత్రి జరిగిన ఐసీసీ బోర్డు సమావేశ నిర్ణయాన్ని బంగ్లాదేశ్‌కు తెలియజేసింది. తన నిర్ణయాన్ని మార్చుకొనేందుకు బీసీబీకి 24 గంటలు..అంటే గురువారం రాత్రి వరకు సమయమిచ్చింది. లేదంటే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని అల్టిమేటమ్ జారీ చేసింది. ఇక..బంగ్లాదేశ్‌పై నిర్ణయంపై ఐసీసీ బోర్డు ఓటింగ్ నిర్వహించింది. బోర్డులోని మొత్తం 16 మందిలో 14 మంది సభ్యులు బంగ్లాదేశ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. బంగ్లాదేశ్‌తోపాటు పాకిస్థాన్ మాత్రమే మద్దతుగా ఓటు వేసింది. కాగా.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తున్నందున ఆ జట్టు ఆడే మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతకుముందు ప్రకటించింది. ‘బంగ్లాదేశ్ డిమాండ్ న్యాయమైనదే. ఒకవేళ బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలిస్తే వాటికి ఆతిథ్యమిచ్చేందుకు మేము సిద్ధం’ అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు కోల్‌కతాలో, ఒకటి ముంబైలో జరగాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..