T20 World Cup 2026: నేడు ఢాకాకు ఐసీసీ బృందం
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:51 AM
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ నడుం బిగించింది. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో...
దుబాయ్: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ నడుం బిగించింది. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో చర్చించేందుకు ఇద్దరు సభ్యులను శనివారం ఢాకా పంపుతున్నట్టు ఐసీసీ వెల్లడించింది. భారత్, శ్రీలంక కలిసి ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ వచ్చేనెల 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. అయితే తమ జట్టు క్రికెటర్ల భద్రతను సాకుగా చూపుతూ కోల్‌కతా, ముంబైలో బంగ్లాదేశ్ ఆడాల్సిన గ్రూపు మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ దశలో వేదికలను మార్చడం సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ ఇప్పటికే స్పష్టంజేసినట్టు సమాచారం. బీసీబీ డిమాండ్ చేసినట్టు ఆ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు కాకుండా..చెన్నై తరలించే విషయంపై చర్చించే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్