భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 10న.. వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:49 PM
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ఈ టోర్నీ ప్రారంభమై.. నవంబర్ 21న ఫైనల్‌తో ముగుస్తుంది (ICC ODI World Cup 2027).
భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. 2027, అక్టోబర్ 10వ తేదీన ఇరు జట్లు తలపడబోతున్నాయి. అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో ఈ మ్యాచ్ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో ప్రారంభించనుంది. కేప్‌టౌన్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. 2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. మూడు ఆతిథ్య దేశాల్లోని 12 వేదికల్లో 57 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి ప్రపంచకప్ ఫార్మాట్‌లో కూడా మార్పులు చేశారు. నాకౌట్ దశకు ముందు మూడు దశలు ఉంటాయి (World Cup 2027 Schedule).
భారత్ లీగ్ దశలో అక్టోబర్7న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 10న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 14న అఫ్గానిస్థాన్‌తో, అక్టోబర్ 24న జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది (India vs Pakistan 2027). దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్, జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, డర్బన్ వంటి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. జింబాబ్వే, నమీబియాలోనూ మ్యాచ్‌లకు వేదికలు ఖరారయ్యాయి. ఫైనల్ నవంబర్ 21న జరగనుంది.
ఇవి కూడా చదవండి..
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం.