Rajiv Gandhi U19 T20: ‘రాజీవ్’ టీ20 విజేత హైదరాబాద్
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:23 AM
రాజీవ్ గాంధీ అండర్-19 టీ20 క్రికెట్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాజీవ్ గాంధీ అండర్-19 టీ20 క్రికెట్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 6 వికెట్లతో గెలిచింది. తొలుత సీఎ్‌ఫఐ జట్టు 17.1 ఓవర్లలో 124 రన్స్‌కు ఆలౌటైంది. ఛేదనలో హైదరాబాద్ 13.1 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసి నెగ్గింది. మహిళల విభాగంలో కోచింగ్ బియాండ్ జట్టు చాంపియన్ ట్రోఫీ దక్కించుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పోటీల నిర్వాహకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్