Womens Hockey World Cup Qualifiers: హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:09 AM
మహిళల హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు...
హైదరాబాద్ ఆతిథ్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మహిళల హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పోటీల నిర్వహణ గురించి హాకీ ఇండియా (హెచ్‌ఐ)తో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఎంఓయూ చేసుకుంది. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడా సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాట్ వీసీ-ఎండీ సోనీ బాలదేవి, అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఇక్రామ్, హెచ్‌ఐ చీఫ్ దిలీప్ టిర్కే పాల్గొన్నారు. ఇక, భారత్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నాయి. ఈ ఈవెంట్‌లో టాప్-3లో నిలిచిన జట్లు నేరుగా వరల్డ్‌క్‌పకు అర్హత సాధిస్తాయి.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా