Share News

రేసింగ్‌లో నవీన్‌ జోడీకి మూడో స్థానం

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:53 AM

ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షి‌ప్‌లో హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల, కో-డ్రైవర్‌ మూసా షెరిఫ్‌ ద్వయం...

రేసింగ్‌లో నవీన్‌ జోడీకి మూడో స్థానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షి‌ప్‌లో హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల, కో-డ్రైవర్‌ మూసా షెరిఫ్‌ ద్వయం తృతీయ స్థానం సాధించింది. పరాగ్వేలో జరిగిన పోటీల్లో మొత్తం 357.64 కిలోమీటర్ల దూరాన్ని ఈ ద్వయం 5 గంటల 10 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసింది. మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా, 44 మాత్రమే రేసును పూర్తి చేశాయి. ఇక, ఈనెల 10 నుంచి చిలీలో జరిగే డబ్ల్యూఆర్‌సీ ఆఖరి ర్యాలీలో నవీన్‌ ద్వయం బరిలోకి దిగనుంది.

ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!

Updated Date - Sep 02 , 2026 | 05:53 AM