Share News

టీజీ20 లీగ్‌ విజేత హైదరాబాద్‌ ఫైనల్లో ఖమ్మం ఓటమి

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:11 AM

టీజీ 20 లీగ్‌ ఆరంభ టోర్నీ టైటిల్‌ను హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 6 వికెట్లతో...

టీజీ20 లీగ్‌ విజేత హైదరాబాద్‌ ఫైనల్లో ఖమ్మం ఓటమి

హైదరాబాద్‌: టీజీ 20 లీగ్‌ ఆరంభ టోర్నీ టైటిల్‌ను హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 6 వికెట్లతో అన్విత ఖమ్మం ఏసె్‌సపై గెలిచింది. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. మికీ జైస్వాల్‌ (65) హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు. 26/3 స్కోరుతో ఖమ్మం కష్టాల్లో పడిన దశలో..మికీ, హిమతేజ (31) నాలుగో వికెట్‌కు 94 రన్స్‌తో పరిస్థితి చక్కదిద్దారు. చివర్లో విద్యానందరెడ్డి (20 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. యశ్వీర్‌ 3, దేవ్‌ మెహతా, అజయ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్‌ 17.4 ఓవర్లలో 158/4 స్కోరు చేసి నెగ్గింది. అభిరథ్‌ (48), వైష్ణవ్‌ రెడ్డి (41 నాటౌట్‌), షణ్ముఖ్‌ (36), ప్రణవ్‌ (19 నాటౌట్‌) రాణించారు.

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:11 AM