Share News

ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో భవిష్‌ అదరహో

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:51 AM

ప్రపంచ స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాలుడు చేవూరు భవిష్‌ రెడ్డి ఆరు పతకాలు కొల్లగొట్టి, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు...

ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో భవిష్‌ అదరహో

ప్రపంచ నెంబర్‌ 1 ర్యాంక్‌ కైవసం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాలుడు చేవూరు భవిష్‌ రెడ్డి ఆరు పతకాలు కొల్లగొట్టి, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. బెల్జియంలోని ఆస్టెండ్‌లో జరిగిన ఫ్లాండర్స్‌ గ్రాండ్‌ ప్రీ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భవిష్‌ ఆరు విభాగాల్లో పోటీపడ్డాడు. మినియమ్‌ బాలుర ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ 1200 మీటర్ల విభాగంలో రెండు స్వర్ణాలు, 600 మీ. కేటగరీలో స్వర్ణం, రజతం, అలాగే 1000 మీటర్లలో స్వర్ణాన్ని గెల్చుకున్నాడు. ఇక 800 మీటర్ల కేటగిరీలో మరో రజతంతో మెరిశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 8 పాయింట్లు సాధించిన భవిష్‌ మినియమ్‌ బాలుర విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భవిష్‌ను శాట్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి అభినందించారు.

ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!

Updated Date - Sep 02 , 2026 | 05:51 AM