Share News

గుజరాత్‌పై హైదరాబాద్‌ గెలుపు

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:41 AM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు 5 వికెట్లతో గుజరాత్‌ను ఓడించింది. గ్రూప్‌-డిలో భాగంగా మంగళవారం...

గుజరాత్‌పై హైదరాబాద్‌ గెలుపు

కోల్‌కతా: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు 5 వికెట్లతో గుజరాత్‌ను ఓడించింది. గ్రూప్‌-డిలో భాగంగా మంగళవారం ఇక్కడి ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన పోరులో మొదట గుజరాత్‌ 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. హర్షల్‌ (41), అశుతోష్‌ (40) ఫర్వాలేదనిపించారు. రక్షణ్‌, ప్రణవ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో అమన్‌ రావు (59), హిమతేజ (54) అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 188/5 స్కోరు చేసి గెలిచింది. రాహుల్‌ బుద్ది (29) రాణించాడు. అర్జాన్‌, రవి చెరో 2 వికెట్లు తీశారు. ఇక, చండీగఢ్‌లో జరిగిన గ్రూప్‌-సి పోరులో ఆంధ్ర జట్టు 3 వికెట్లతో పుదుచ్చేరిని ఓడించింది.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 03:41 AM