హుస్సాముద్దీన్‌కు కాంస్యమే
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:00 AM
బాక్సమ్ ఎలీట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు...
లా నూసియా (స్పెయిన్): బాక్సమ్ ఎలీట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 60 కిలోల సెమీఫైనల్లో హుస్సాముద్దీన్ ఓటమిపాలయ్యాడు. అలాగే ప్రాంజల్ యాదవ్ (65కి.), కాజల్ (65కి.), సనమాచా చాను (75కి.), మన్‌కీరత్ కౌర్ (80+కి.), జాదుమణి సింగ్ (55కి.), హితేష్ (70కి.) కూడా సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్యాలతో సంతృప్తి పడాల్సివచ్చింది. ఇక.. లవ్లీనా బోర్గోహైన్, సచిన్ ఫైనల్‌కు దూసుకుపోయారు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!