Share News

ఐదోసీడ్‌కు ప్రణయ్‌ షాక్‌

ABN , Publish Date - May 28 , 2026 | 02:13 AM

భారత సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సంచలన ప్రదర్శన...

ఐదోసీడ్‌కు ప్రణయ్‌ షాక్‌

లక్ష్య ముందుకు ఫ శ్రీకాంత్‌ ఇంటికి

సింగపూర్‌: భారత సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్లో ప్రణయ్‌ 10-21, 21-12, 21-18తో ఐదోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)ని చిత్తుచేశాడు. క్రిస్టీని ప్రణయ్‌ ఓడించడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. ఇక, తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 20-22, 21-19, 17-21తో స్థానిక స్టార్‌ లో కీన్‌ యే చేతిలో ఓడాడు. మరో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-17, 21-15తో లూ గువాంగ్‌ (చైనా)పై గెలిచాడు. ఇక మాళవిక బన్సోడ్‌ 21-11, 19-21, 12-21తో లిన్‌ సియాంగ్‌ తి (చైనీస్‌ తైపీ) చేతిలో తొలిరౌండ్‌లోనే పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్‌ కపిల/తనీషా 21-15, 20-22, 21-13తో మలేసియా ద్వయం వోంగ్‌ తిన్‌ సి/లిమ్‌ చూ సీన్‌పై గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 02:13 AM