భారత్ ఓడినా ఆశలు సజీవం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:28 AM
పురుషుల హాకీ వరల్డ్‌కప్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. శనివారం గ్రూప్ ‘ఇ’ రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్...
మహిళల ప్రపంచకప్‌లో నేడు
భారత్ X ఆస్ట్రేలియా
(రాత్రి 10 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో)
సెమీ్‌సకు నెదర్లాండ్స్
హాకీ వరల్డ్‌కప్
ఆమ్‌స్టెల్వీన్: పురుషుల హాకీ వరల్డ్‌కప్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. శనివారం గ్రూప్ ‘ఇ’ రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో 1-3 తో ఓడింది. ఈ ఫలితంతో డచ్ ఆరు పాయింట్లతో సెమీ్‌సలో అడుగుపెట్టింది. అయితే మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 3-1తో అర్జెంటీనా గెలవడంతో భారత జట్టు సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇక సోమవారం భారత జట్టు అర్జెంటీనాపై భారీతేడాతో గెలిస్తే సెమీ్‌సకు వెళుతుంది. డచ్ నుంచి డుకో టెల్గెన్‌కాం్‌ప (41), జెప్ హోడిమేకర్స్ (51), థిస్ వాన్ డమ్ (55) గోల్స్ సాధించగా.. భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (52వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. తొలి రెండు క్వార్టర్లలో భారత ఆటగాళ్లు మెరుగ్గా ఆడారు. అయితే ఆ తర్వాత డచ్ ఆటలో దూకుడు పెరిగింది. భారత్ డిఫెన్స్‌ను వమ్ము చేస్తూ 3 ఫీల్డ్ గోల్స్ సాధించడం విశేషం. అటు భారత్‌కు పెనాల్టీ కార్నర్ ద్వారా ఏకైక గోల్ దక్కింది.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్