హర్మన్‌ప్రీత్ సారథ్యంలో..
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:20 AM
ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచక్‌పలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు...
హాకీ ప్రపంచక్‌పనకు భారత జట్టు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచక్‌పలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. ఈ మెగా టోర్నీ వచ్చేనెల 15 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో జరగనుంది. ఇటీవల లండన్ ప్రొ లీగ్‌లో 24 మంది ఆటగాళ్లతో భారత జట్టు బరిలోకి దిగింది. అయితే, ఆ జట్టులోని అమన్‌దీప్ లక్రా, రాజ్‌కుమార్ పాల్, రవిచంద్ర సింగ్, సెల్వం కార్తీలను మినహాయించి మిగతా 20 మందిని ప్రపంచక్‌పనకు ఎంపిక చేశారు. టోర్నీలో పూల్-డిలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 15న వేల్స్‌తో, 17న ఇంగ్లండ్, 19న పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా
రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి