ముకేష్ డబుల్ ధమాకా
ABN , Publish Date - Feb 12 , 2026 | 04:35 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గుంటూరు షూటర్ నేలవల్లి ముకేష్ మరో రెండు పతకాలు కొల్లగొట్టాడు. దీంతో ఈ టోర్నీలో అతను సాధించిన పతకాల సంఖ్య...
ఆసియా షూటింగ్
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గుంటూరు షూటర్ నేలవల్లి ముకేష్ మరో రెండు పతకాలు కొల్లగొట్టాడు. దీంతో ఈ టోర్నీలో అతను సాధించిన పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. బుధవారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ జూనియర్ వ్యక్తిగత విభాగంలో ముకేష్ కాంస్య పతకం గెలిచాడు. అనంతరం టీమ్ ఈవెంట్‌లో సూరజ్ శర్మ, సాహిల్ చౌధురితో కలిసి ముకేష్ స్వర్ణం సాధించాడు. ఇక, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ సీనియర్ కేటగిరిలో అనీష్ భన్వాలా కాంస్యం నెగ్గాడు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!
టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం