గుజరాత్ కమాల్
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:53 AM
డెత్ ఓవర్లలో నిక్కీ ప్రసాద్ (24 బంతుల్లో 47), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29) వణికించినా.. సోఫీ డివైన్ (4/37) మ్యాజిక్‌తో గెలుపు వాకిట ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం...
ఢిల్లీపై ఉత్కంఠ గెలుపు
నిక్కీ, రాణా శ్రమ వృథా
డివైన్‌కు 4 వికెట్లు
మూనీ అర్ధ శతకం
వడోదర: డెత్ ఓవర్లలో నిక్కీ ప్రసాద్ (24 బంతుల్లో 47), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29) వణికించినా.. సోఫీ డివైన్ (4/37) మ్యాజిక్‌తో గెలుపు వాకిట ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 పరుగుల తేడాతో ఢిల్లీపై నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 9 పరుగులు కావల్సి ఉండగా.. రాణా, ప్రసాద్‌ను అవుట్ చేసిన డివైన్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. తొలుత గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. బెత్ మూనీ (58) అర్ధ శతకం సాధించగా.. అనుష్క శర్మ (39) ఫర్వాలేదనిపించింది. శ్రీచరణి నాలుగు, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ ఓవర్లన్నీ ఆడి 171/8 స్కోరు మాత్రమే చేసింది. 100/6తో పరాజయం తప్పదనుకొన్న పరిస్థితుల్లో నిక్కీ, రాణా ఏడో వికెట్‌కు 31 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యంతో విజయంపై ఆశలు లేపారు. కానీ, ఆఖరి ఓవర్‌లో తడబాటుతో ఫలితం తలకిందులైంది. డివైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 174/9 (మూనీ 58, అనుష్క 39; చరణి 4/31, హెన్రీ 2/38);
ఢిల్లీ: 20 ఓవర్లలో 171/8 (నిక్కీ 47, రాణా 29; డివైన్ 4/37, రాజేశ్వరి గైక్వాడ్ 3/20).
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్