Gavaskar Criticizes Melbourne Pitch: మరెక్కడైనా జరిగితే.. గగ్గోలే
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:04 AM
యాషెస్ సిరీ్‌సలో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ రెండోరోజే ముగిసింది. ఈ పిచ్‌కు ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. అయితే, ఆస్ర్టేలియాలో కాకుండా...
మెల్‌బోర్న్ పిచ్‌పై గవాస్కర్
న్యూఢిల్లీ: యాషెస్ సిరీ్‌సలో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ రెండోరోజే ముగిసింది. ఈ పిచ్‌కు ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. అయితే, ఆస్ర్టేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా జరిగే ఉంటే మాత్రం.. ఏదో అనర్థం జరిగిందని గగ్గోలు పెట్టేవారని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ‘ఏదో మిన్ను విరిగి మీదపడినట్టు నానా రచ్చ చేసేవారు. గతంలో అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొంటే ‘మానవ తప్పిదం’ అనేవారు. కానీ, ఉపఖండ అంపైర్లు అలా చేస్తే ‘మోసం’ అంటూ గగ్గోలు పెట్టేవార’ని గవాస్కర్ రాశాడు.
ఇవి కూడా చదవండి:
Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్
T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!