Share News

గాఫ్‌కు షాక్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:49 AM

ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ కొకొ గాఫ్‌కు క్వార్టర్స్‌లోనే షాక్‌ తగిలింది. కార్లోస్‌ అల్కారజ్‌ ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్‌ గండాన్ని దాటగా.. డిఫెండింగ్‌ చాంప్‌ అరియానా సబలెంక సెమీ్‌సకు...

గాఫ్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఫసెమీ్‌సలో అల్కారజ్‌, సబలెంక

ఫజ్వెరెవ్‌, స్విటోలినా కూడా..

మెల్‌బోర్న్‌: ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ కొకొ గాఫ్‌కు క్వార్టర్స్‌లోనే షాక్‌ తగిలింది. కార్లోస్‌ అల్కారజ్‌ ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్‌ గండాన్ని దాటగా.. డిఫెండింగ్‌ చాంప్‌ అరియానా సబలెంక సెమీ్‌సకు చేరుకొంది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ అల్కారజ్‌ 7-5, 6-2, 6-1తో అలెక్స్‌ డి మెనార్‌ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో గెలిచాడు. ఈ క్రమంలో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీ్‌సలోకి అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా ప్లేయర్‌ గాఫ్‌ 1-6, 2-6తో 12వ సీడ్‌ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్‌) చేతిలో చిత్తుగా ఓడింది. 59 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్‌.. సర్వీస్‌ బ్రేక్‌ అయిన ప్రతీసారీ అసహనంతో తన రాకెట్‌ను నేలకేసి కొట్టింది. కాగా, సబలెంక 6-3, 6-0తో ఇవా జోవిచ్‌ (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. గురువారం జరిగే సెమీ్‌సలో స్విటోలినాతో సబలెంక అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-7(5), 6-1, 7-6(3) లెర్నర్‌ టీన్‌ (అమెరికా)పై కష్టంగా గెలిచాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో అల్కారజ్‌తో జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.

ఇవి కూడా చదవండి:

'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్

Updated Date - Jan 28 , 2026 | 02:49 AM