‘ఎన్‌ఎస్‌బీ’ సిఫార్సు కమిటీలో నారంగ్
ABN , Publish Date - Jun 16 , 2026 | 02:36 AM
జాతీయ స్పోర్ట్స్ బోర్డు (ఎన్‌ఎస్‌బీ) ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సెక్రటరీ...
న్యూఢిల్లీ: జాతీయ స్పోర్ట్స్ బోర్డు (ఎన్‌ఎస్‌బీ) ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సెక్రటరీ టీవీ సోమ్‌నాథన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల సెర్చ్, సెలెక్షన్ కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ షూటర్ గగన్ నారంగ్, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కుంజరాణి దేవితోపాటు స్పోర్ట్స్ సెక్రటరీ హరిరంజన్ రావు, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్‌పాల్ సింగ్‌లకు చోటు దక్కింది. ఎన్‌ఎ్‌సబీ బోర్డు చైర్మన్, ఇద్దరు సభ్యులను సిఫారసు చేయడం సెర్చ్ కమిటీ ప్రధాన విధి.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా