Share News

అలాగైతే బాయ్‌కాట్‌ చేద్దాం

ABN , Publish Date - May 06 , 2026 | 01:34 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ ఆదాయంలో ఆటగాళ్లకు దక్కాల్సిన ప్రైజ్‌మనీ వాటా శాతాన్ని నిర్వాహకులు తగ్గించడంపై భగ్గుమంటున్న...

అలాగైతే బాయ్‌కాట్‌ చేద్దాం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీపై సబలెంక

రోమ్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ ఆదాయంలో ఆటగాళ్లకు దక్కాల్సిన ప్రైజ్‌మనీ వాటా శాతాన్ని నిర్వాహకులు తగ్గించడంపై భగ్గుమంటున్న టాప్‌ ప్లేయర్లు తమ స్వరాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ విషయంలో నిర్వాహకులు దిగిరాకపోతే.. ఏకంగా బాయ్‌కాట్‌ చేద్దామంటూ మహిళల నెంబర్‌వన్‌ సబలెంక సహచరులకు పిలుపునిచ్చింది. 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టోర్నీ ఆదాయంలో క్రీడాకారులకిచ్చే మొత్తం 15.5 శాతం ఉండగా.. ఈసారి దాన్ని 14.9 శాతానికి తగ్గించారు. ఓవరాల్‌ ప్రైజ్‌మనీని పెంచినా, ఆటగాళ్ల ఆదాయంలో వాటాను తగ్గించడంపై స్టార్‌ ప్లేయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 01:34 AM