Share News

ఆండ్రీవా వర్సెస్ ఖాలీన్‌స్కా

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:51 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్‌ కోసం 8వ సీడ్‌ మిర్రా ఆండ్రీవా, 114వ ర్యాంకర్‌ మాయా ఖాలీన్‌స్కా శనివారం పోటీపడనున్నారు. ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌...

ఆండ్రీవా వర్సెస్ ఖాలీన్‌స్కా

ఎవరో కొత్త చాంప్‌?

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు

(సాయంత్రం 6.30 నుంచి)

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్‌ కోసం 8వ సీడ్‌ మిర్రా ఆండ్రీవా, 114వ ర్యాంకర్‌ మాయా ఖాలీన్‌స్కా శనివారం పోటీపడనున్నారు. ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. 19 ఏళ్ల ఆండ్రీవాకు ఇప్పటికే అనేక పర్యాయాలు అత్యుత్తమ క్రీడాకారిణులను ఓడించిన అనుభవం ఉండగా.. 24 ఏళ్ల ఖాలీన్‌స్కా ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు మేజర్‌ టోర్నీల్లో రెండోరౌండ్‌ దాటిన రికార్డు కూడా లేదు. మరి.. ఇద్దరిలో పైచేయి ఎవరిది? కొత్త చాంపియన్‌గా నిలిచేది ఎవరు?

హోటల్‌ బిల్లులు చెల్లించలేక..

పారిస్‌: క్వాలిఫయర్‌గా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించిన పోలెండ్‌ తార మాయా ఖాలీన్‌స్కా.. ఈ గ్రాండ్‌స్లామ్‌ కోసం తాను బస చేసిన హోటల్‌ బిల్లులు కూడా చెల్లించలేక అవస్థ పడిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. విషయమేమంటే.. గ్రాండ్‌స్లామ్స్‌లో తొలిరౌండ్‌లో ఓడినా డబ్బు లభిస్తుంది. కానీ, మ్యాచ్‌లు ఓడినా, గెలిచినా ప్రైజ్‌మనీని టోర్నీ ముగిశాకే ప్లేయర్లకు అందజేస్తారు. దీంతో టోర్నీ సందర్భంగా సదరు ప్లేయర్లే వసతి ఏర్పాట్లు చూసుకోవాలి. ఇక.. ఈ టోర్నీకి ముందు ఖాలీన్‌స్కా పెద్దగా ఎవరికీ తెలియదు.. అందునా, క్వాలిఫయర్‌ కాబట్టి ఆమెకు స్పాన్సరర్‌ లేరు. దీంతో తన వద్ద ఉన్న కొంత నగదుతోనే పారి్‌స వచ్చింది. అయితే, ఆమె ఫైనల్‌ దాకా రావడంతో హోటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. కానీ, అన్నిరోజులకు హోటల్‌ బిల్లులు చెల్లించేందుకు డబ్బు సరిపోక ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న పోలెండ్‌కు చెందిన ఓ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ సంస్థ ముందుకొచ్చి ఖాలీన్‌స్కా బిల్లులు చెల్లించిందట. ఏదేమైనా.. ఈ టోర్నీ సందర్భంగా ఓవైపు ఆర్ధిక ఇబ్బందులను భరిస్తూనే అద్భుత ప్రదర్శన చేయడం ఆమె పోరాటస్ఫూర్తికి నిదర్శనం. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ముందు ఖాలీన్‌స్కా కెరీర్‌ మొత్తం సంపాదన రూ. 8.2 కోట్లు కాగా.. ఇంతకు రెట్టింపుగా రూ. 15.38 కోట్లను ఇక్కడ ఫైనల్‌ చేరడంతోనే ఆమె అందుకోనుండడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 03:51 AM