అయ్యో.. సిన్నర్
ABN , Publish Date - May 29 , 2026 | 01:15 AM
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్ యానిక్ సిన్నర్ ఎండదెబ్బకు తాళలేక రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు సిన్నర్...
రెండో రౌండ్‌లోనే అవుట్
జ్వెరెవ్, సబలెంక ముందంజ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్ యానిక్ సిన్నర్ ఎండదెబ్బకు తాళలేక రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు సిన్నర్ 6-3, 6-2, 5-7, 1-6, 1-6తో జువాన్ మాన్యువల్ సెరంబోలో (అర్జెంటీనా) చేతిలో ఐదు సెట్లపాటు పోరాడి ఓడాడు. మూడు గంటల 36 నిమిషాలపాటు సాగిన పోరులో తొలి రెండు సెట్లను యానిక్ సులువుగానే సొంతం చేసుకొన్నాడు. కానీ, మూడో సెట్‌లో అనూహ్యంగా సీన్ మారిపోయింది. ఒక దశలో 5-1తో మ్యాచ్‌ను అలవోకగా సొంతం చేసుకొంటాడనుకొన్న సిన్నర్ ఒక్కసారిగా డీలాపడ్డాడు. దీంతో పుంజుకొన్న జువాన్.. వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. అయితే, విపరీతమైన వేడిమి, కండరాల నొప్పుతో సిన్నర్ ఇబ్బంది పడ్డాడు. మూడో సెట్ ముగిసిన తర్వాత వైద్యుల సాయంతో మినరల్ డ్రింక్ తీసుకొన్నా కోలుకోలేక పోయాడు. కాగా, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-2, 6-2తో మచాక్‌పై, కాస్పర్ రూడ్ 6-3, 6-2, 6-4తో మెడ్జ్‌డోవిచ్‌పై, కొబోలి 6-4, 6-4, 6-4తో ఉ ఇబింగ్‌పై, టీన్ 7-5, 4-6, 3-6, 7-6(4), 6-3తో అకోస్టాపై నెగ్గారు.
గాఫ్ మూడో రౌండ్‌కు..: మహిళల సింగిల్స్‌లో కొకొ గాఫ్ 6-3, 6-2తో మయర్‌పై, సబలెంక 7-5, 6-2తో ఎల్సా జాక్‌మోట్‌పై, ఒసాక 7-6(1), 6-4 డోనా వికిక్‌పై, ఇవా జోవిచ్ 6-0, 6-3తో ఎమ్మా నవారోపై, కరోలినా ముకోవా 6-2, 6-2తో కమిల్లా రఖిమోవాపై, మజా చావ్లిన్‌స్కా 6-4, 6-0తో మెర్టిన్స్‌పై నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్