Share News

రిబకినాకు ఝలక్‌

ABN , Publish Date - May 28 , 2026 | 02:06 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనాల పర్వం మొదలైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న రెండో సీడ్‌ ఎలెనా రిబకినా...

రిబకినాకు ఝలక్‌

ముగిసిన బసవారెడ్డి పోరాటం

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనాల పర్వం మొదలైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న రెండో సీడ్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌), ఐదోసీడ్‌ జెస్సికా పెగుల రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం జరిగిన పోరులో ఉక్రెయిన్‌కు చెందిన స్టారోడత్సెవా 3-6, 6-1, 7-6(10-4)తో వింబుల్డన్‌ మాజీ విజేత రిబకినాకు ఝలకిచ్చింది. ఆస్ట్రేలియా ప్లేయర్‌ కింబర్లీ బిరెల్‌ 1-6, 6-3, 6-3తో పెగుల (అమెరికా)కు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో స్వియటెక్‌ 6-2, 6-3 తో సారా బెజ్లెక్‌ను చిత్తుచేసింది. ఇక స్విటోలినా 6-0, 6-4తో క్వెవెడోపై గెలిచింది. సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ 6-3, 6-2 6-7(7-9), 6-3తో స్థానిక ఆటగాడు వాలెంటిన్‌ను ఓడించాడు. ఇక, తొలి రౌండ్లో ప్రపం చ నెంబర్‌వన్‌ యానిక్‌ సినర్‌ 6-1, 6-3, 6-4తో క్లెమెంట్‌ను ఓడించాడు.

పోరాడి ఓడిన బసవారెడ్డి: తొలి రౌండ్లో ఏడో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన తెలుగు సంతతికి చెందిన అమెరికా ఆటగాడు నిశేష్‌ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అమెరికాకే చెందిన అన్‌సీడెడ్‌ అలెక్స్‌ మైకేల్‌సన్‌ 7-6 (7-5), 6-3, 3-6, 6-3తో బసవారెడ్డిపై గెలిచాడు

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 02:08 AM