Share News

శ్రీజేష్‌ స్థానంలో సోయెజ్‌

ABN , Publish Date - May 15 , 2026 | 02:00 AM

ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడెరిక్‌ సోయెజ్‌ భారత జూనియర్‌ హాకీ జట్టు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈమేరకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ప్రకటించింది...

శ్రీజేష్‌ స్థానంలో సోయెజ్‌

జూ.హాకీ జట్టు కోచ్‌గా నియామకం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడెరిక్‌ సోయెజ్‌ భారత జూనియర్‌ హాకీ జట్టు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈమేరకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ప్రకటించింది. శ్రీజేష్‌ స్థానంలో అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు. 48 ఏళ్ల ఫ్రెడెరిక్‌ 1995 నుంచి 2010 వరకు 196 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 15 ఏళ్ల కెరీర్‌లో 195 గోల్స్‌ చేశాడు. రిటైర్‌ అయిన అనంతరం కోచ్‌గా స్థిరపడ్డాడు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌ పురుషుల జాతీయ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. కాగా..హాకీ ఇండియా కుటుంబంలోకి సోయెజ్‌ను సాదరంగా స్వాగతిస్తున్నట్టు అధ్యక్షుడు దిలీప్‌ టిర్కే పేర్కొన్నాడు.

వార్తలు కూడా చదవండి

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

Updated Date - May 15 , 2026 | 02:00 AM